Local Body Polls: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దొందూ దొందే: సీపీఎం మధు
- స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వీర్యం చేస్తున్నాయి
- వైసీపీ దౌర్జన్యాలకు పాల్పడుతోంది
- పోలీసులు ప్రభుత్వానికి కొమ్ముకాస్తున్నారు
స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వీర్యం చేయడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ దొందూదొందేనని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు విమర్శించారు. ఈరోజు ఆయన పార్టీ మేనిఫెస్టోను విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలో అధికార పార్టీ దౌర్జన్యాలకు పాల్పడుతోందని, విపక్ష పార్టీల అభ్యర్థులు నామినేషన్‌లు వేయకుండా అడ్డుకుంటోందని ధ్వజమెత్తారు. అడ్డుకోవాల్సిన పోలీసులు అధికార పార్టీకి కొమ్ముకాస్తున్నారని ఆరోపించారు. ఏఏ స్థానాలు ఏకగ్రీవం అవుతాయో ఆ స్థానాల్లో అక్రమాలు జరిగాయని గుర్తించాలన్నారు. దౌర్జన్యాలు జరిగిన చోట ఎన్నికలు నిలిపివేయాని డిమాండ్ చేశారు.