Mobile Phone: జీఎస్టీ పోటు... పెరగనున్న మొబైల్ ఫోన్ల ధరలు

Due to GST hike there is a chance to rise mobile prices

  • నిర్మలా సీతారామన్ ఆధ్వర్యంలో జీఎస్టీ మండలి సమావేశం
  • మొబైల్ ఫోన్లపై 12 శాతం జీఎస్టీ 18 శాతానికి పెంపు
  • ఏప్రిల్ 1 నుంచి అమలు

కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన ఢిల్లీలో జీఎస్టీ మండలి సమావేశం జరిగింది. జీఎస్టీ పన్నులపై ఈ సమావేశంలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కొన్ని వస్తువులపై జీఎస్టీ పెంచాలని నిర్ణయం తీసుకున్నారు. మొబైల్ ఫోన్లు, ప్రత్యేక విడిభాగాలపై ఇప్పటివరకు ఉన్న 12 శాతం జీఎస్టీని 18 శాతానికి పెంచనున్నారు.

ఇది అమల్లోకి వస్తే ఏప్రిల్ నుంచి మొబైల్ ఫోన్ల ధరలకు రెక్కలొస్తాయి. ఏప్రిల్ 1 నుంచి సవరించిన జీఎస్టీ అమల్లోకి రానుండడమే అందుకు కారణం. ఇక, నిర్వహణ, మరమ్మతు, సమగ్ర సేవలపై ఇప్పటివరకు అమల్లో ఉన్న 18 శాతాన్ని ఒక్కసారిగా 5 శాతానికి తగ్గించారు. మరికొన్ని జీఎస్టీ సమీక్ష సమావేశాల అనంతరం ఈ ఏడాది జూలై నాటికి అందరికీ ఆమోదయోగ్యమైన జీఎస్టీ విధానం అందుబాటులోకి వస్తుందని నిర్మలా సీతారామన్ తెలిపారు.

  • Loading...

More Telugu News