Corona Virus: ఆ 355 మంది కోసం తీవ్రంగా గాలిస్తున్న అధికారులు!

Pinjab Searching for Missing Foreign Commers
  • కరోనా ప్రభావిత దేశాల నుంచి పంజాబ్ కు 6,011 మంది
  • వారిలో కనిపించకుండా పోయిన వారి కోసం గాలింపు
  • దేశంలో ఇప్పటివరకూ 84 కేసులు
వివిధ కరోనా ప్రభావిత దేశాల నుంచి వచ్చిన వారిలో 355 మంది ఆచూకీ తెలియకపోవడం ఇప్పుడు పంజాబ్ కు సమస్యగా మారింది. వారి ఆచూకీ కోసం అధికారులు విస్తృతంగా గాలిస్తున్నారు. ఈ నెల 13వ తేదీ వరకూ ఫారిన్ నుంచి 6,011 మంది వచ్చినట్టుగా ఆరోగ్య శాఖ రిపోర్ట్ వెల్లడిస్తోంది. వీరిలో 90 మందికి కరోనా లక్షణాలు ఉన్నట్టు గుర్తించిన వైద్యులు, వారి రక్త నమూనాలను పరీక్షించగా, 85 మందికి నెగటివ్ అని రిజల్ట్స్ వచ్చింది. మిగతావారి పరీక్షా ఫలితాలు ఇంకా రాలేదు. విదేశాల నుంచి వచ్చిన వారిలో కనిపించకుండా పోయిన వారిని గుర్తించి, వారికి కూడా పరీక్షలు చేస్తామని పంజాబ్ ప్రభుత్వం వెల్లడించింది. కాగా, ఇప్పటివరకూ ఇండియాలో కరోనా పాజిటివ్ వచ్చిన కేసుల సంఖ్య 84 కేసులు నమోదు కాగా, అందులో 17 మంది విదేశీయులు ఉన్నారు.
Corona Virus
Punjab
Missing People

More Telugu News