India: దేశంలో 100కు చేరిన కరోనా పాజిటివ్ కేసులు.. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటివరకు 5,839 మంది మృతి
- ఇప్పటివరకు 152 దేశాలకు విస్తరించిన కరోనా వైరస్ కొవిడ్-19
- చైనాలో అత్యధికంగా 3199 మంది మృతి
- ఇటలీలో 1441, ఇరాన్లో 611, స్పెయిన్‌లో 196 మంది మృతి
భారత్‌లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 100కు చేరింది. కరోనా బాధితుల కోసం అన్ని చర్యలు తీసుకోవాలని అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలను కేంద్ర సర్కారు కోరింది. అమెరికాలో తెలుగు వారి కోసం ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) హెల్ప్ లైన్ నంబరు ఏర్పాటు చేసింది. 1-855- అవర్- తానాకు ఫోన్ చేయాలని చెప్పింది. అమెరికాలో కాలేజీలన్నింటినీ మూసేశారు.
ఇప్పటివరకు 152 దేశాలకు కరోనా వైరస్ కొవిడ్-19 విస్తరించింది. కరోనాతో ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటివరకు 5,839 మంది ప్రాణాలు కోల్పోయారు. చైనాలో అత్యధికంగా 3199, ఇటలీలో 1441, ఇరాన్లో 611, స్పెయిన్‌లో 196, ఫ్రాన్స్‌లో 91, దక్షిణ కొరియాలో 75, అమెరికాలో 60 మంది మృతి చెందారు.