Corona Virus: కరోనా పుట్టిన వూహాన్‌లో వెల్లివిరుస్తున్న ఆనందం.. వీడియో వైరల్

 Chinese doctors celebrate closure of the last temporary hospital in Wuhan

  • కరోనా వైరస్‌ను వెళ్లగొట్టిన వైద్యులు
  • చివరి ఆసుపత్రి మూత
  • వెళ్తూవెళ్తూ ముఖానికి మాస్కులు తొలగించిన వైద్యులు

వూహాన్.. ఈ పేరు తెలియనివారు ప్రపంచంలోనే ఎవరూ ఉండరనడం అతిశయోక్తి కాదేమో. ప్రస్తుతం ప్రపంచాన్ని గజగజలాడిస్తున్న కరోనా వైరస్ పురుడు పోసుకున్నది ఇక్కడే. ప్రపంచవ్యాప్తంగా వేలాది మంది ఉసురుతీసి, మరెంతో మందిని భయం కోరల్లోకి నెట్టేసిన వైరస్ ఉనికి ప్రారంభమైంది ఇక్కడే. ప్రపంచం మొత్తం ఇప్పుడు ఈ వైరస్ బారినపడి అల్లాడిపోతుండగా, వూహాన్ మాత్రం ఇప్పుడు ఈ మహమ్మారి బారి నుంచి తప్పించుకుంది.

అక్కడ కొత్త కేసుల నమోదు పూర్తిగా ఆగిపోయింది. దీంతో ఇప్పటి వరకు నిర్బంధంలో వున్న హుబేయి ప్రావిన్స్‌లో జనం కళ్లలో మళ్లీ ఆనందం కనిపిస్తోంది. ప్రభుత్వం తీసుకున్న కట్టుదిట్టమైన చర్యల వల్ల వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట పడింది. దీంతో అక్కడ తాత్కాలికంగా ఏర్పాటు చేసిన ఆసుపత్రిని ప్రభుత్వం మూసివేసింది. ఇన్నాళ్లూ ముఖానికి మాస్కులతో కరోనా బాధితులకు సేవలు అందించిన వైద్యులు వెళ్తూవెళ్తూ ముఖాలకు మాస్కులు తొలగించి ఆనందం వ్యక్తం చేశారు. విజయ చిహ్నం చూపిస్తూ తమ సంతోషాన్ని బయటపెట్టారు. ఇప్పుడు ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

  • Loading...

More Telugu News