Corona Virus: కరోనాతో అల్లాడుతున్న ప్రపంచానికి గుడ్‌న్యూస్.. నేడు క్లినికల్ ట్రయల్స్‌కు సిద్ధమైన వ్యాక్సిన్!
- అమెరికాలో సిద్ధమైన వ్యాక్సిన్
- నేడు ఓ వ్యక్తిపై ప్రయోగించనున్న వైద్యులు
- పూర్తిస్థాయిలో ధ్రువీకరణకు మరో 18 నెలలు ఆగాల్సిందే
కరోనాతో అల్లాడుతున్న ప్రపంచానికి ఇది గుడ్‌న్యూసే. ఈ మహమ్మారికి అడ్డుకట్ట వేసే ఔషధం కోసం ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న పరిశోధనల్లో పురోగతి కనిపించింది. శాస్త్రవేత్తల విశేష కృషితో రూపొందిన ఓ వ్యాక్సిన్ ఇప్పుడు క్లినికల్ ట్రయల్స్‌కు సిద్ధమైంది. నేడు ఓ వ్యక్తిపై దీనిని ప్రయోగించనున్నట్టు అమెరికాకు చెందిన ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. అయితే, ఈ విషయాన్ని ప్రభుత్వం ఇప్పటి వరకు అధికారికంగా ప్రకటించలేదు.
ఈ వ్యాక్సిన్ పనితీరును పూర్తిస్థాయిలో ధ్రువపరిచేందుకు 18 నెలలు వేచి చూడక తప్పదని వైద్యాధికారులు తెలిపారు. వ్యాక్సిన్‌ను వేయించుకునేందుకు స్వచ్ఛందంగా ముందుకు వచ్చిన 45 మందిపై తొలుత దీనిని ప్రయోగించనున్నారు. క్లినికల్ ట్రయల్స్ వల్ల ఎటువంటి ప్రమాదం ఉండదని, మరిన్ని లోతైన ప్రయోగాలకు ఇది ఊతమిస్తుందని, అలాగే దుష్పరిణామాల గురించి కూడా తెలుసుకునే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు తెలిపారు.