Corona Virus: ఆ రెండుసార్లు నెగెటివ్ వస్తేనే కరోనా వైరస్ నుంచి బయటపడినట్టు!
- డిశ్చార్జి పాలసీని విడుదల చేసిన కేంద్ర ప్రభుత్వం
- చికిత్స అందించే వారికి 24 గంటల్లో రెండుసార్లు పరీక్షలు
- రెండుసార్లూ వైరస్ లేదని రిపోర్టులో వస్తేనే విడుదల
ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చించుకుంటున్న అంశం కరోనా. చైనాలో మొదలై యూరప్ లో అలజడి సృష్టిస్తున్న ఈ వైరస్ భారత్ లోనూ ఆందోళనకర రీతిలో విస్తరిస్తోంది. ఇప్పటికే వ్యాధిని జాతీయ విపత్తుగా ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం చికిత్స అందిస్తున్న వారిని విడుదల చేయడానికి తాజాగా 'డిశ్చార్జి పాలసీ'ని ఆయా ఆసుపత్రులకు విడుదల చేసింది.
ఈ నివేదిక ప్రకారం ఐసోలేషన్ వార్డుల్లో చికిత్స పొందుతున్న బాధితులు కోలుకున్నారని పూర్తి నమ్మకం కుదిరాక ఇరవై నాలుగు గంటల వ్యవధిలో రెండుసార్లు కరోనా పరీక్షలు చేస్తారు. ఆ రెండుసార్లూ నెగిటివ్ రిపోర్టు రావాలి. ఈ శాంపిళ్ల టెస్ట్‌తో పాటు చెస్ట్ రేడియోగ్రఫీ కూడా చేస్తారు. దీని ద్వారా బాధితుడు శ్వాస సంబంధిత సమస్యతో బాధపడుతున్నాడా? లేదా? అనేది తెలుసుకుంటారు. అక్కడ కూడా ఓకే అనిపిస్తేనే రోగిని ఆసుపత్రి నుంచి డిశ్చార్జి చేస్తారు.