Corona Virus: ఆంధ్రప్రదేశ్‌లో 'కమ్మ'ల మీద మన నయా హిట్లర్ జగన్ కక్ష గట్టాడు: టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల విమర్శలు

mla gorantla about corona
  • కరోనా వైరస్‌ ప్రపంచాన్ని భయపెడుతోంది
  • సీఎం జగన్ మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాడు
  • ముందు జాగ్రత్తగా ఏం చేయాలో చెప్పాలిగానీ ఇంత నిర్లక్ష్యంగా ఉండకూడదు
  • 9 రాష్ట్రాల్లో ఇప్పటికే కాలేజీలు, బడులు మూసేశారు 
'కరోనా'కు పారాసిటిమల్ వాడాలని ఏపీ సీఎం జగన్‌ చెప్పారు. కరోనా వైరస్‌ ప్రపంచాన్ని భయపెడుతుంటే సీఎం జగన్ మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాడు. ముందు జాగ్రత్తగా ఏంచేయాలో చెప్పాలిగానీ ఇంత నిర్లక్ష్యంగా ఉండకూడదు' అని టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి విమర్శలు గుప్పించారు.  

రాజమహేంద్రవరంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడతూ...'9 రాష్ట్రాల్లో ఇప్పటికే కాలేజీలు, బడులు మూసేశారు. కరోనా వ్యాప్తిని అరికట్టడానికి మనమందరం కృషి చేద్దాం. భారతీయ సంప్రదాయం ప్రకారం నమస్కారం పెడదాం. విదేశీ ప్రధానులు కూడా ఇప్పుడు నమస్కారం పెడుతున్నారు' అని బుచ్చయ్య తెలిపారు.

'యూదుల మీద హిట్లర్‌ ఎలా కక్షగట్టాడో, ఆంధ్రప్రదేశ్‌లో కమ్మల మీద మన నయా హిట్లర్ జగన్ అలా కక్ష గట్టాడు.. ఎన్నికల ప్రక్రియ అంతా రద్దు అవ్వాలి.. ఇక్కడ కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికలను సజావుగా నిర్వహించాలి.. తమ మంత్రులకు జగన్‌ వార్నింగ్‌ ఇచ్చాడు.. గెలవకపోతే పదవులు ఉండవని చెప్పాడు. అందుకే రాష్ట్రంలో హింస చెలరేగింది. ఎన్నికల నోటిఫికేషన్‌ వచ్చాక ముఖ్యమంత్రికి అధికారాలు ఉండవు' అని ఆయన వ్యాఖ్యానించారు.
Corona Virus
Gorantla Butchaiah Chowdary

More Telugu News