JC Diwakar Reddy: భస్మాసురుడు తన నెత్తిపై తానే చేయి పెట్టుకున్నాడు: జేసీ దివాకర్ రెడ్డి

One Bhasmasura is there in AP says JC Diwakar Reddy

  • ఈసీ, గవర్నర్ ఎవరూ ఉండకూడదని జగన్ భావిస్తున్నారు
  • ఎన్నికల ప్రక్రియను ఈసీ వాయిదా వేయడం మంచి నిర్ణయం
  • సామాజికవర్గం అనేది ప్రతి ఒక్కరికీ ఉంటుంది

రాష్ట్రంలో ఒక భస్మాసురుడు ఉన్నాడని.. తన నెత్తి మీద తానే చేయి పెట్టుకున్నాడని టీడీపీ నేత జేసీ దివాకర్ రెడ్డి అన్నారు. ఆ భస్మాసురుడు ఎవరో ప్రజలందరికీ తెలుసని చెప్పారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ను కలిసేందుకు ఎన్నికల సంఘం కార్యాలయానికి ఈరోజు దివాకర్ రెడ్డి వచ్చారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, ముఖ్యమంత్రి జగన్ పై విమర్శలు గుప్పించారు.

రాష్ట్రంలో గవర్నర్, ఈసీ ఎవరూ ఉండకూడదని జగన్ భావిస్తున్నారని జేసీ అన్నారు. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులుగా ఒక్కరే ఉండి... పక్కన పోలీసులు ఉంటే సరిపోతుందనే విధంగా ఆయన వ్యవహారశైలి ఉందని మండిపడ్డారు. స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను ఎన్నికల సంఘం వాయిదా వేయడం మంచి నిర్ణయమని చెప్పారు. జగన్ చాలా తెలివైనవాడంటూ వ్యంగ్యాన్ని ప్రదర్శించారు. సామాజికవర్గం అనేది ప్రతి ఒక్కరికీ ఉంటుందని... అది లేని వారు ఎవరో చెప్పాలని డిమాండ్ చేశారు.

  • Loading...

More Telugu News