kcr: ఏదో ఒక మారుమూల గ్రామానికి నీళ్లు రాకుంటే ‘భగీరథ’ దండగా?: ‘కాంగ్రెస్​’పై సీఎం కేసీఆర్​ ఫైర్​

CM KCR fires on congress leaders

  • కాకతీయ కాల్వలు సజీవంగా పారడం ప్రజలకు కనిపిస్తోంది
  • కాంగ్రెస్ నాయకులకు మాత్రం కనిపించడం లేదు!
  • ‘మంచిని మంచి’ అని మెచ్చుకునే సంస్కృతి ‘కాంగ్రెస్* కు లేదు 

తెలంగాణలోని ఏదో ఒక మారుమూల గ్రామానికి నీళ్లు రాకుంటే భగీరథ పథకం దండగ అన్నట్టు కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడతారా? అంటూ సీఎం కేసీఆర్ ప్రశ్నించారు. తెలంగాణ అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ, సభలో హుందాగా మాట్లాడాలని, ప్రతిపక్షాలు హుందాగా మాట్లాడితే తమ నుంచి వచ్చే సమాధానం అలాగే ఉంటుందని, రాజకీయంగా మాట్లాడితే అదే విధంగా జవాబిస్తామని అన్నారు. ‘మంచిని మంచి’ అనే మెచ్చుకునే సంస్కృతి కాంగ్రెస్ పార్టీకి లేదని విమర్శలు గుప్పించారు.

రాష్ట్రంలో అనేక రంగాల్లో జరుగుతున్న అభివృద్ధి ప్రజల ముందు కనిపిస్తోందని, కాకతీయ కాల్వలు సజీవంగా పారుతుండటం ప్రజలకు కనిపిస్తోంది కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులకు మాత్రం కనిపించడం లేదంటూ చురకలంటించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా లేకుంటే ఇన్ని పథకాలు అమలయ్యేవా? అని ప్రశ్నించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో  విజయ డైరీని శ్మశానంలా చేశారని, పాడిపశువులను పెంచుకునే సంస్కారం లేక గత ప్రభుత్వాలు విజయడైరీని నాశనం చేశాయని, మహారాష్ట్ర, కర్ణాటక డెయిరీల నుంచి పాలు సేకరించేవారని దుయ్యబట్టారు. రూ.30 కోట్ల నష్టాల్లో ఉన్న ఈ డైరీని తెలంగాణ రాష్ట్రం ఏర్పడి తాము అధికారంలోకి వచ్చాక ఆదుకున్నామని చెప్పారు.  

  • Loading...

More Telugu News