Madala Ranga Rao: అప్పట్లో 'విప్లవశంఖం' ఓ సంచలనం: మాదాల రవి
- 'యువతరం కదిలింది' ఓ ట్రెండ్ సెట్టర్
- 'ఎర్ర మల్లెలు' విజయవిహారం చేసింది
- 'విప్లవ శంఖం'లో ఆ పాట దూసుకుపోయిందన్న రవి
తాజాగా 'ఐ డ్రీమ్స్' ఇంటర్వ్యూలో మాదాల రవి మాట్లాడుతూ, తన తండ్రి మాదాల రంగారావు నటించిన సినిమాలను గురించి ప్రస్తావించారు. "అప్పట్లో నాన్నగారు చేసిన 'యువతరం కదిలింది' సినిమా విప్లవ సినిమాలకి ఒక ట్రెండ్ సెట్టర్ గా నిలిచింది. ఆ తరువాత వచ్చిన 'ఎర్రమల్లెలు' ఆయన స్థాయిని పెంచింది. వామ పక్ష భావాలను ఈ సినిమా మరింత బలంగా నాటగలిగింది.
తరువాత వచ్చిన 'విప్లవ శంఖం' సంచలన విజయాన్ని సాధించింది. సెన్సార్ బోర్డువారు అభ్యంతరం వ్యక్తం చేసిన కొన్ని డైలాగ్స్ ను కట్ చేయడానికి నాన్నగారు నిరాకరించారు. ఈ విషయంపై ఆయన చాలాకాలం పాటు పోరాడారు. విడుదలైన ప్రతి థియేటర్లో ఈ సినిమా 100 రోజులు ఆడింది. ఈ సినిమాలోని మాటలు .. పాటలకు ప్రేక్షకులు నీరాజనాలు పట్టారు. శ్రీశ్రీగారు .. నాన్నగారు మంచి మిత్రులు. శ్రీశ్రీగారితో నాన్నగారు రాయించిన 'కొంతమంది కుర్రవాళ్లు' పాట జనంలోకి దూసుకుపోయింది" అని చెప్పుకొచ్చారు.