IPL: కరోనా నేపథ్యంలో ఆటగాళ్లను పంపించేయాలని ఐపీఎల్ ఫ్రాంచైజీల నిర్ణయం
- కరోనా ఎఫెక్ట్ తో ఐపీఎల్ వాయిదా
- తాజాగా ప్రాక్టీసు శిబిరాల నిలిపివేత
- ఆటగాళ్లు వెళ్లిపోవచ్చన్న ఫ్రాంచైజీలు
ఐపీఎల్ తాజా సీజన్ కరోనా మహమ్మారి కారణంగా వాయిదా పడిన నేపథ్యంలో ఐపీఎల్ ఫ్రాంచైజీలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. ప్రస్తుతం జరుగుతున్న ప్రాక్టీసు శిబిరాలను నిలిపివేయాలని నిర్ణయించాయి. ఆటగాళ్లు వెళ్లిపోవచ్చని, ఎప్పుడు రావాలో తాము సమాచారం అందిస్తామని ఫ్రాంచైజీలు స్పష్టం చేశాయి. ఐపీఎల్ అసలు మళ్లీ ప్రారంభం అవుతుందో, లేదో తెలియని సందిగ్ధ పరిస్థితుల్లో ప్రాక్టీసు శిబిరాలు కొనసాగించడం అర్థరహితమని ఫ్రాంచైజీలు భావిస్తున్నాయి. ముంబయి ఇండియన్స్, కోల్ కతా నైట్ రైడర్స్, చెన్నై సూపర్ కింగ్స్ ఇప్పటికే ప్రాక్టీసుకు స్వస్తి పలకగా, నేడు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కూడా వారిబాటలోనే నడిచింది. తాము చెప్పేవరకు ఆటగాళ్లెవరూ రానవసరంలేదని రాయల్ చాలెంజర్స్ ట్వీట్ చేసింది.