Namitha: అశ్లీల వీడియోలు బయటపెడతానంటూ యువకుడి బెదిరింపులు... నీ ఇష్టం వచ్చింది చేసుకో అన్న నమిత!

Namitha strongly replies to youth
  • సోషల్ మీడియాలో యువకుడి అనుచిత ప్రవర్తన
  • హాయ్ ఐటమ్ అంటూ నమితతో సరసమాడే ప్రయత్నం
  • అతడి ఫొటోను షేర్ చేసిన నమిత
దక్షిణాది ప్రేక్షకులకు నమిత గురించి పరిచయం అక్కర్లేదు. తెలుగు, తమిళంలో అనేక హిట్ చిత్రాల్లో నటించిన నమిత పెళ్లి తర్వాత కూడా సినిమాల్లో నటిస్తోంది. అయితే, తాజాగా ఓ యువకుడు నమిత పట్ల బెదిరింపులకు దిగాడు. సోషల్ మీడియాలో నమితతో చాటింగ్ చేస్తూ ఒక్కసారిగా హద్దుమీరాడు. హాయ్ ఐటమ్ అంటూ సరసానికి దిగాడు. దాంతో నమిత ఆగ్రహం వ్యక్తం చేయగా, "నీ అకౌంట్ హ్యాక్ అయింది" అంటూ నమ్మబలికాడు. అతడి మాటలను నమిత నమ్మకపోగా, మరింత తీవ్రంగా స్పందించింది.

దాంతో, "నీ అశ్లీల వీడియోలు నా వద్ద ఉన్నాయి, వాటిని బయటపెడతాను" అంటూ బెదిరింపులకు దిగాడు. అయితే, నమిత కూడా ఏమీ తగ్గకుండా, "నీ ఇష్టం వచ్చింది చేసుకో" అంటూ ధైర్యం ప్రదర్శించింది. అంతేకాదు, ఆ యువకుడి ఫొటోను కూడా సోషల్ మీడియాలో వెల్లడి చేసింది. ఇలాంటి వాళ్లకు గట్టిగా బుద్ధి చెప్పాలని, అందుకే అతడి ఫొటోను అందరితో పంచుకుంటున్నానని తెలిపింది.
Namitha
Harassment
Social Media
Tollywood
Kollywood
Videos

More Telugu News