Tejas: తుది పరీక్షల్లో విజయం సాధించిన 'తేజస్'!

Fighter Jet Tejas is ready for Army

  • స్వదేశీ యుద్ధ విమానానికి పరీక్షలు
  • 40 నిమిషాల పాటు టెస్టింగ్
  • మరో 15 విమానాలు ఏడాదిలో సిద్ధం

స్వదేశీ యుద్ధ విమానం తేజస్, తుది పరీక్షలను పూర్తి చేసుకుంది. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ లో ఈ ఫైటర్ జెట్ ను అభివృద్ధి చేయగా, ఇప్పటికే పలు దశల్లో దీనికి పరీక్షలు జరిగాయి. తాజాగా, సైనికాధికారులు, సైంటిస్టులు, తయారీ నిపుణుల సమక్షంలో తుది పరీక్షలు నిర్వహించినట్టు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. దాదాపు 40 నిమిషాల పాటు ఈ పరీక్షలు జరిగాయని తెలిపాయి. కాగా, ఇండియాలో తయారైన తొలి తేలికపాటి యుద్ధ విమానంగా తేజస్ నిలిచిన సంగతి తెలిసిందే. వచ్చే ఆర్థిక సంవత్సరంలో మరో 15 యుద్ధ విమానాలను సైన్యానికి అందించాలన్న లక్ష్యంతో హెచ్ఏఎల్ ప్రణాళికలు రూపొందించింది. వీటి తయారీ ఇప్పటికే తుది దశకు చేరింది.

  • Loading...

More Telugu News