K. Keshava Rao: రాజ్యసభ సభ్యులుగా కేకే, సురేశ్​ రెడ్డి ఏకగ్రీవం

KK and Suresh Reddy as unanimous members of Rajya Sabha
  • నేటి సాయంత్రంతో ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ గడువు
  • ఈ మేరకు ఎన్నికల కమిషన్ వెల్లడి
  • టీఆర్ఎస్ నేతల హర్షం
తెలంగాణలోని అధికారపార్టీ టీఆర్ఎస్ నుంచి రాజ్యసభ సభ్యులుగా కె.కేశవరావు, సురేశ్ రెడ్డిలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వీరి ఎన్నిక ఏకగ్రీవమైనట్టు ఎన్నికల కమిషన్ వెల్లడించింది. కాగా, రాజ్యసభ నామినేషన్ల గడువు గత శుక్రవారంతో ముగిసింది. నేటి సాయంత్రం మూడు గంటలతో నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసింది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసే సమయానికి ఆయా స్థానాల నుంచి ఎవరూ పోటీలో లేకపోవడంతో కేకే, సురేశ్ రెడ్డి ల ఎన్నిక ఏకగ్రీవమైంది. కేకే, సురేశ్ రెడ్డిలు ఏకగ్రీవం కావడంపై టీఆర్ఎస్ నేతలు హర్షం వ్యక్తం చేశారు.
K. Keshava Rao
KR Suresh Reddy
Rajya Sabha
members

More Telugu News