Indian Army: కేంద్రం సంచలన నిర్ణయం.. 10 లక్షల మంది సైనికుల సెలవులు రద్దు!
- వ్యక్తిగత, ప్రజా భద్రత కోసం యుద్ధ సన్నద్ధతతో పనిచేయాలని పిలుపు
- కరోనా నిర్ధారణ కోసం ప్రైవేటు సంస్థకు బాధ్యతలు
- అత్యవసరం కాని ప్రయాణాలు రద్దు
పది లక్షల మంది సైనికులు, పారా మిలటరీ బలగాలకు అత్యవసరేత సెలవుల్ని రద్దు చేస్తూ కేంద్ర హోంమంత్రిత్వ శాఖ సంచలన నిర్ణయం తీసుకుంది. సెలవుల నుంచి వచ్చిన వారికి వైరస్ పరీక్షలు చేస్తున్నారు. అలాగే, అత్యవసరం కాని ప్రయాణాలను, సదస్సులను రద్దు చేశారు. వ్యక్తిగత, ప్రజా భద్రత కోసం యుద్ధ సన్నద్ధతతో పనిచేయాలని బలగాలను కేంద్రం ఆదేశించింది. ఇక, కరోనా వైరస్ నిర్ధారణ కోసం కేంద్రం తొలిసారిగా రోష్ డయాగ్నస్టిక్స్ ఇండియా అనే ప్రైవేటు సంస్థకు బాధ్యతలు అప్పగించింది.
కాగా, లడఖ్ రెజిమెంట్‌కు చెందిన ఓ సైనికుడికి కరోనా వైరస్ సోకినట్టు నిర్ధారణ అయింది. ఇరాన్ పర్యటనకు వెళ్లొచ్చిన ఆయన తండ్రి ద్వారా ఈ వైరస్ అతడికి సోకినట్టు నిర్ధారణ అయింది. ప్రస్తుతం ఆ సైనికుడు వైద్యుల పర్యవేక్షణలో ఉన్నాడు.