Tirumala: తిరుమలలో భక్తుల సంఖ్య పరిమితం... ఒకరిని ఒకరు తాకకుండా వెళుతూ లఘు దర్శనం!
- నిన్న స్వామిని దర్శించుకున్న 48 వేల మంది
- హుండీ ద్వారా ఆదాయం రూ. 1.53 కోట్లు
- సేవా టికెట్లు పొందిన వారికి దర్శనం కల్పిస్తున్నామన్న టీటీడీ
కరోనా భయంతో తిరుమలకు భక్తుల రాక తగ్గింది. ఇదే సమయంలో ఎక్కడా వేచి చూడకుండా స్వామి దర్శనానికి టైమ్ స్లాట్ టోకెన్లను కేటాయించి మరీ పంపుతుండగా, క్యూలైన్లలో సైతం ఒకరిని ఒకరు తాకకుండా వెళుతున్నారు. భక్తుల రద్దీ తగ్గడంతో, మహా లఘుదర్శనం స్థానంలో, లఘు దర్శనాన్ని ఆలయంలో అమలు చేస్తున్నారు.
కాగా, నిన్న స్వామివారిని 48 వేల మంది దర్శించుకున్నారు. 18 వేల మందికి పైగా తలనీలాలు సమర్పించారు. హుండీ ద్వారా రూ. 1.53 కోట్ల ఆదాయం లభించింది. కొన్ని ఆర్జిత సేవలను రద్దు చేశామని, అయితే, గతంలో ఆయా సేవా టికెట్లను పొందిన భక్తులకు స్వామివారి దర్శనం కల్పిస్తున్నామని అధికారులు వెల్లడించారు.