Karimnagar District: కరీంనగర్‌లో 100 ప్రత్యేక బృందాలతో ఇంటింటికీ వెళ్తూ కరోనా పరీక్షలు

coronavirus cases in karimnagar

  • ఇండోనేషియా నుంచి కరీంనగర్‌కు వచ్చిన వారిలో ఏడుగురికి కరోనా 
  • వారు పర్యటించిన ప్రాంతంలోని ప్రజలకు వైద్య పరీక్షలు
  • ప్రజలు ఇళ్లలోంచి బయటకు రావద్దని అధికారుల సూచన
  • అవసరమైతే ఆయా ప్రాంతాల్లో నిర్బంధం విధింపు

కరీంనగర్‌ ప్రజలకు కరోనా భయం పట్టుకుంది. ఇండోనేషియా నుంచి కరీంనగర్‌కు వచ్చిన వారిలో ఏడుగురికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ కావడంతో తెలంగాణ ప్రభుత్వం ఆ జిల్లాలో మరిన్ని చర్యలు తీసుకుంటోంది. ఇండోనేషియా వ్యక్తులు కరీంనగర్‌లో 48 గంటలపాటు ఉన్నారు.

ఇండోనేషియా నుంచి వచ్చిన వారు పర్యటించిన కలెక్టరేట్‌కు మూడు కిలోమీటర్ల పరిధిలోని ప్రజలకు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. ప్రజలు ఇళ్లలోంచి బయటకు రావద్దని అధికారులు సూచించారు. ఆ ప్రాంతాల ప్రజలు వైద్యులకు సహకరించాలని ప్రభుత్వం కోరుతోంది.

ఆ జిల్లాలో 100 ప్రత్యేక బృందాలతో వైద్య సిబ్బంది ఇంటింటికి వెళ్లి కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు. అవసరమైతే ఆయా ప్రాంతాల్లో నిర్బంధం విధించాలని అధికారులు భావిస్తున్నారు. ఈ రోజు ఆ జిల్లాలో తెలంగాణ మంత్రి గంగుల కమలాకర్ పర్యటించి,  వైద్య సిబ్బందితో మాట్లాడి పరిస్థితులను సమీక్షించారు. తెలంగాణలో ఇప్పటివరకు కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 13కు చేరిన విషయం తెలిసిందే.    

  • Loading...

More Telugu News