Corona Virus: ఇష్టమొచ్చిన రెమెడీలు వద్దు.. నిపుణుల సలహా తీసుకోండి: 'కరోనా'పై మంత్రులకు మోదీ హెచ్చరిక
- బీజేపీ నేతల వ్యాఖ్యలు వివాదాస్పదం అవుతుండటంతో స్పందన
- ఆరోగ్య శాఖ మార్గదర్శకాలు, సూచనలు పాటించాలని విజ్ఞప్తి
- కరోనాపై మోదీ చాలా అలర్ట్ గా ఉన్నారన్న కేంద్ర మంత్రి
కరోనా వైరస్ నివారణకు ఆవు మూత్రం పనిచేస్తుంది, మరేదో పనిచేస్తోదంటూ బీజేపీ మంత్రులు, నేతలు మాట్లాడుతుండటంపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అసహనం వ్యక్తం చేశారు. బీజేపీ నేతల వ్యాఖ్యలు, చర్యలపై తీవ్రంగా విమర్శలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో మోదీ స్పందించారు. అయితే ఈ విషయాలను నేరుగా ప్రస్తావించకుండానే మంత్రులు, బీజేపీ లీడర్లకు పలు హెచ్చరికలు జారీ చేశారు.