Kamal Nath: కమల్ నాథ్ సర్కారుకు రేపు బలపరీక్ష... సుప్రీంకోర్టు ఆదేశం

Supreme Court orders Madhya Pradesh speaker to arrange floor test for Kamal Nath government

  • మైనారిటీలో పడిన కాంగ్రెస్ ప్రభుత్వం
  • బలనిరూపణ కోరుతూ సుప్రీంను ఆశ్రయించిన బీజేపీ
  • సాయంత్రం 5 గంటలకు సభ ఏర్పాటు చేయాలని స్పీకర్ కు సుప్రీం ఆదేశం

మధ్యప్రదేశ్ అసెంబ్లీలో రేపు కమల్ నాథ్ సర్కారు బలనిరూపణకు అవకాశం కల్పించాలంటూ స్పీకర్ ఎన్పీ ప్రజాపతిని సుప్రీం కోర్టు ఆదేశించింది. శుక్రవారం సాయంత్రం 5 గంటలకు  ఈ కార్యక్రమం ఏర్పాటు చేయాలని సూచించింది. కమల్ నాథ్ సారథ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం బలనిరూపణ చేసుకునే సమయంలో అసెంబ్లీ సమావేశాలను వీడియోగా చిత్రీకరించాలని, వీలైతే లైవ్ స్ట్రీమింగ్ చేయాలని జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం స్పష్టం చేసింది.

అంతేకాదు, 16 మంది రెబెల్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బలనిరూపణ సందర్భంగా అసెంబ్లీకి హాజరయ్యే పక్షంలో వారికి భద్రత కల్పించాలంటూ మధ్యప్రదేశ్, కర్ణాటక డీజీపీలను ఆదేశించింది. ఎలాంటి అవరోధాలు కల్పించని విధంగా బలనిరూపణే ఏకైక అజెండాగా సభ నిర్వహించాలని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. మధ్యప్రదేశ్ లో కమల్ నాథ్ సర్కారు మైనారిటీలో పడిన నేపథ్యంలో అత్యవసరంగా బలనిరూపణ నిర్వహించాలని కోరుతూ బీజేపీ సుప్రీంకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News