Tirumala: తిరుమల, కాశీ మూతపడతాయని ఏనాడో చెప్పిన బ్రహ్మంగారి కాలజ్ఞానం!
- కరోనా భయంతో ఆలయంలో దర్శనాలు నిలిపివేత
- వందల ఏళ్ల క్రితమే జోస్యం చెప్పిన బ్రహ్మంగారు
- 1892 తరువాత తొలిసారి ఇలా
తిరుపతి వెంకన్న దేవాలయం మూతబడుతుందని, కాశీ పట్న దేవాలయం పాడుపడుతుందని కాలజ్ఞాని శ్రీ విరాట్ పోతులూరి వీర బ్రహ్మం తన కాల జ్ఞానంలో చెప్పిన మాటలు నిజమయ్యాయి. కాశీలోని విశ్వనాథాలయం విషయంలో దాదాపు శతాబ్దం క్రితమే కాలజ్ఞానం నిజమైంది. 1910-12 మధ్య గంగానదికి తీవ్రమైన వరదలు వచ్చి, కలరా వ్యాపించగా, నెలన్నర పాటు భక్తులు విశ్వనాథుని దర్శనానికి వెళ్లలేదు.
ఇక తిరుమల విషయంలోనూ బ్రహ్మాంగారు చెప్పిందే నిజమైంది. కరోనా వైరస్ భయాల నేపథ్యంలో స్వామివారి దర్శనానికి భక్తులను అనుమతించబోమని టీటీడీ స్పష్టం చేసింది. ఆలయ చరిత్రలో స్వామి దర్శనాలకు భక్తులను అనుమతించకపోవడం ఇది రెండోసారి. 1892లో స్వామివారి ఆలయాన్ని ఓసారి మూసి వేశారు. అందుకు కారణాలు ఏంటన్న విషయమై స్పష్టమైన సమాచారం లేదు. ఆ తరువాత భక్తుల రాకను నిలిపివేసిన సందర్భం ఇదే.