Donald Trump: కరోనాకు ఔషధం ఇదే... వెంటనే పెద్దఎత్తున అందుబాటులోకి!: డొనాల్డ్ ట్రంప్

Chloro quin is Effective on Corona Virus

  • మలేరియాకు వాడే క్లోరోక్విన్ సమర్థవంతం
  • అజిత్రోమైసిన్ తో కలిపి తీసుకుంటే ఫలితం
  • వెల్లడించిన అమెరికా అధ్యక్షుడు

కరోనా వైరస్ కు విరుగుడు ప్రతి ఒక్కరికీ తెలిసిన మందేనని, మలేరియాను నిరోధించే క్లోరోక్విన్ సమర్ధవంతంగా కరోనాను ఎదుర్కొంటోందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. తక్షణమే ఈ డ్రగ్ ను పెద్దఎత్తున అందుబాటులోకి తెస్తున్నామని ఇది దేశ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్డీఏ) గొప్పదనమని వ్యాఖ్యానించారు. యాంటీ బయాటిక్ అజిత్రో మైసిన్ తో కలిపి క్లోరోక్విన్ ను తీసుకుంటే, వ్యాధి బారిన పడిన వారిలో వైరస్ స్థాయి గణనీయంగా తగ్గిందని ఆయన అన్నారు.

కాగా, క్లోరోక్విన్ ప్రభావవంతంగా పని చేస్తోందని ఇప్పటికే చైనా అధికారికంగా ప్రకటించింది. కొవిడ్ టీకా తయారీకి పెద్దఎత్తున జరుగుతున్న ట్రయల్స్ లోనూ కార్యకర్తలకు క్లోరోక్విన్ ను ఇస్తున్నారు. మరోవైపు దక్షిణ కొరియా, బెల్జియం తదితర దేశాలు కరోనాకు విరుగుడుగా ఇదే ఔషధాలను వాడుతున్నాయి.

ఇక, ఏప్రిల్ నాటికి కొవిడ్ నిరోధక వాక్సిన్ ను అందుబాటులోకి తెస్తామని చైనా శాస్త్రవేత్తలు ప్రకటించారు. యూఎస్ లో ఫేజ్-1 ట్రయల్స్ ఇప్పటికే మొదలయ్యాయి. మలేరియా చికిత్సలో భాగంగా 1944లో తొలిసారిగా క్లోరోక్విన్ ను వినియోగించారు. ఆపై కాలేయ ఇన్ ఫెక్షన్స్ సోకిన వారికి ఇచ్చి, స్వస్థత చేకూర్చారు.

  • Loading...

More Telugu News