G. Kishan Reddy: కరోనాపై రాష్ట్రాలకు అనేక సూచనలు చేశాం: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
- కరోనా అనుమానిత లక్షణాలు ఉన్నవారికి సత్వర వైద్య సేవలు
- రాష్ట్రాల వైద్య శాఖ కార్యదర్శులతో పలుసార్లు మాట్లాడాం
- అన్ని విమానాశ్రయాల్లో తనిఖీలు
- దేశ సరిహద్దుల వద్ద కట్టుదిట్టమైన నిఘా
దేశంలో కరోనా క్రమంగా విస్తరిస్తోన్న నేపథ్యంలో అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు అనేక సూచనలు చేశామని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. కరోనా అనుమానిత లక్షణాలు ఉన్నవారికి సత్వర వైద్య సేవలు అందిస్తున్నట్లు చెప్పారు. జనవరి 22 నుంచి ఇప్పటివరకు కరోరనాపై అధికారికంగా 22 సమావేశాలు నిర్వహించామని తెలిపారు.
జనవరి 27 నుంచి రాష్ట్రాల వైద్య శాఖ కార్యదర్శులతో పలుసార్లు మాట్లాడామని కిషన్ రెడ్డి అన్నారు. కేంద్రమంత్రి హర్షవర్ధన్ నిత్యం రాష్ట్రాలను సంప్రదిస్తున్నారని, జనవరి 26 నుంచి అన్ని విమానాశ్రయాల్లోనూ తనిఖీలు చేస్తున్నారని తెలిపారు. దేశ సరిహద్దుల వద్ద కట్టుదిట్టమైన నిఘా ఏర్పాటు చేశామని చెప్పారు.