Maruthi: ఇలాంటి పరిస్థితి వస్తుందనీ, 'మహానుభావుడు' గుర్తొస్తాడని అనుకోలేదు: దర్శకుడు మారుతి

mahanubhavudu Movie
  • మారుతి  దర్శకత్వంలో వచ్చిన 'మహానుభావుడు'
  • కరోనా సమయంలో గుర్తు చేసుకుంటున్న యూత్ 
  • ఇప్పుడైతే మరింత బాగా  తీసేవాడినన్న మారుతి
మారుతి దర్శకత్వంలో కొంతకాలం క్రితం 'మహానుభావుడు' సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. శర్వానంద్                కథానాయకుడిగా నటించిన ఈ సినిమా అన్నివర్గాల ప్రేక్షకుల ఆదరణ పొందింది. ఈ సినిమాలో శర్వానంద్ అతి శుభ్రం పాటిస్తూ ఉంటాడు. ఎవరికీ షేక్ హ్యాండ్ ఇవ్వకపోవడం .. ఒకవేళ అవతలివారు ఇస్తే, వెంటనే శానిటైజర్ వాడటం .. హాస్పిటల్ కి వెళితే మాస్క్ ధరించడం .. ఎవరైనా తుమ్మబోతే వాళ్లకి ఆమడ దూరం పారిపోవడం .. హీరోయిన్ ను హత్తుకోవడానికి కూడా ఆలోచించడం వంటివి చూసి అంతా నవ్వుకున్నారు. కొంతమంది అతి ఎక్కువైందని అనుకున్నారు.

కానీ ఇప్పుడు అంతకన్నా ఎక్కువ శుభ్రాన్నే చాలామంది పాటిస్తున్నారనే విషయాన్ని మారుతి ప్రస్తావించాడు. కరోనా వైరస్ నేపథ్యంలో అంతా మా సినిమాను గుర్తు చేసుకోవడం .. ప్రస్తుత పరిస్థితికి అన్వయిస్తూ కామెడీగా కామెంట్లు పెట్టడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో అయితే ఈ సినిమాను ఇంకా బాగా తీసేవాడినని మారుతి చెప్పుకొచ్చాడు.
Maruthi
Sharwanand
Mahanubhavudu MOvie

More Telugu News