Corona Virus: శంషాబాద్​ లో క్యాబ్​ డ్రైవర్​కు ‘కరోనా’ లక్షణాలు!

A Cab Driver has corona virus features
  • గాంధీ ఆసుపత్రికి బాధితుడి తరలింపు
  • వైద్య పరీక్షలు నిర్వహిస్తున్న వైద్యులు
  • మాస్క్ లు, శానిటైజర్లు యాజమాన్యం ఇవ్వాలంటున్న డ్రైవర్లు
రంగారెడ్డి జిల్లా శంషాబాద్ లో క్యాబ్ డ్రైవర్ కు కరోనా వైరస్ లక్షణాలు ఉన్నట్టు గుర్తించారు. దాంతో హైదరాబాద్ లోని గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఐసోలేషన్ గదిలో ఉంచి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నట్టు సమాచారం. ఈ సందర్భంగా క్యాబ్ డ్రైవర్లు మాట్లాడుతూ, ఎప్పుడేమి జరుగుతుందోనన్న ఆందోళనతో ఉన్నామని అన్నారు. ‘కరోనా’ నేపథ్యంలో ప్రభుత్వం సెలవులు ప్రకటించడం బాగానే ఉంది కానీ, ప్రతి నెలా చెల్లించాల్సిన ఈఎంఐలు కట్టాలంటే వాహనం నడపక తప్పదని, అయితే, విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులు రాకపోవడంతో ‘బిజినెస్’ జరగడం లేదని అన్నారు.

‘కరోనా’ వ్యాపించకుండా ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా గ్లౌజెస్, మాస్క్ లు, శానిటైజర్స్ తమ యాజమాన్యాలు అందజేస్తే బాగుంటుందని క్యాబ్ డ్రైవర్లు అభిప్రాయపడ్డారు. ఈ విషయమై ప్రభుత్వం చొరవ తీసుకోవాలని కోరారు. ఇదిలా ఉండగా, తెలంగాణలో ‘కరోనా’ పాజిటివ్ కేసుల సంఖ్య 17కు చేరింది. ఈ మేరకు ఆరోగ్యశాఖ  ధ్రువీకరించింది.
Corona Virus
Shamshabad
cab driver
Gandhi hospital

More Telugu News