Sensex: కరోనా భయాలను పక్కనపెట్టి దూసుకుపోయిన మార్కెట్లు
- 1,628 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్
- 482 పాయింట్లు లాభపడ్డ నిఫ్టీ
- 18.58 శాతం పెరిగిన ఓఎన్జీసీ
కరోనా భయాలతో గత నాలుగు సెషన్లుగా భారీ నష్టాలను మూటగట్టుకున్న దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు దూసుకుపోయాయి. ఆర్థిక సమస్యల నుంచి గట్టెక్కించడానికి కేంద్ర ప్రభుత్వం తాయిలాలను ప్రకటిస్తుందనే అంచనాలతో ఇన్వెస్టర్ల సెంటిమెంట్ బలపడింది. ఈ నేపథ్యంలో ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 1,628 పాయింట్లు లాభపడి 29,916కి ఎగబాకింది. నిఫ్టీ 482 పాయింట్లు పెరిగి 8,745కి చేరుకుంది. ఈ నాటి ట్రేడింగ్ లో అన్ని సూచీలు లాభపడ్డాయి. ఎనర్జీ షేర్లు 9 శాతం పైగా... చమురు, మెటల్, ఐటీ, టెక్ స్టాకులు 8 శాతానికి పైగా లాభపడ్డాయి.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
ఓఎన్జీసీ (18.58%), అల్ట్రాటెక్ సిమెంట్ (13.01%), హిందుస్థాన్ యూనిలీవర్ (11.75%), రిలయన్స్ ఇండస్ట్రీస్ (11.24%), టీసీఎస్ (9.90%).
సెన్సెక్స్ లో హెచ్డీఎఫ్సీ (-1.39%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (-0.88%) మాత్రమే నష్టపోయాయి.