Video Call: వరుడు మారిషస్ లో... వధువు భారత్ లో... వీడియో కాల్ తో పెళ్లి చేశారు!

Video call marriage happens due to corona

  • మారిషస్ లో ఇంజినీర్ గా పనిచేస్తున్న యూపీ యువకుడు తౌసిఫ్
  • షాజహాన్ పూర్ అమ్మాయితో ఈ నెల 19న పెళ్లి నిశ్చయం
  • విమానాలు లేకపోవడంతో మారిషస్ లోనే నిలిచిపోయిన తౌసిఫ్

కరోనా ఎంతపని చేసిందో చూడండి! విమానాలు రద్దవడంతో వరుడు మారిషస్ లో నిలిచిపోగా, ముహూర్తం మించిపోతుండడంతో కుటుంబసభ్యులు వీడియో కాల్ సాయంతో పెళ్లి చేశారు. ఉత్తరప్రదేశ్ లోని అంటాచౌరాహే ప్రాంతానికి చెందిన తౌసిఫ్ మారిషస్ లో ఇంజినీర్ గా పనిచేస్తున్నాడు. అతనికి షాజహాన్ పూర్ కు చెందిన యువతితో పెళ్లి నిశ్చయమైంది. ఈ నెల 19న వివాహ ముహూర్తం నిర్ణయించారు. అయితే మారిషస్ నుంచి భారత్ కు విమానాలు రద్దు చేయడంతో తౌసిఫ్ అక్కడే నిలిచిపోయాడు.

దాంతో ఇరు కుటుంబాల వారు వీడియో కాల్ తో పెళ్లి చేయాలని భావించారు. ఈ క్రమంలో తౌసిఫ్ కుటుంబసభ్యులు షాజహాన్ పూర్ లోని వధువు ఇంటికి వెళ్లి పెళ్లి సమ్మతమేనంటూ ఆమెతో  అంగీకార పత్రంపై సంతకం చేయించుకున్నారు. ఆపై, వీడియో కాల్ ద్వారా తౌసిఫ్ తో నిఖా జరిపించారు. పరిస్థితి కుదుటపడిన తర్వాత తౌసిఫ్ వస్తే అతడికి అమ్మాయిని అప్పగిస్తామని బంధువులు తెలిపారు.

  • Loading...

More Telugu News