China: చైనాపై అంతర్జాతీయ కోర్టులో కేసు వేయొచ్చు: ఇజ్రాయెల్ న్యాయ నిపుణుడు

Israel blames china for not alerted over corona virus

  • మిగతా ప్రపంచాన్ని అప్రమత్తం చేయడంలో చైనా విఫలం
  • ఉగ్రవాదం కోణంలో చైనాను కోర్టుకు లాగొచ్చు
  • ఇజ్రాయెల్ న్యాయ నిపుణుడు నిసాన్

చైనాలోని వూహాన్‌లో పుట్టిన కరోనా వైరస్ ఇప్పుడు ప్రపంచాన్ని దిగ్బంధంలోకి నెట్టేసింది. వేలాదిమంది ప్రాణాలు బలిగొని, లక్షలాదిమందిని ప్రమాదంలోకి నెట్టేసింది. అయితే, ఈ విషయంలో మిగతా ప్రపంచాన్ని అప్రమత్తం చేయని చైనాపై ఇజ్రాయెల్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ ప్రాణాంతక మహమ్మారిపై  మిగతా ప్రపంచాన్ని అప్రమత్తం చేయనందుకు ఆ దేశంపై అంతర్జాతీయ న్యాయస్థానంలో కేసులు వేయొచ్చని ఇజ్రాయెల్ న్యాయ నిపుణుడు నిసాన్ దర్శన్ లీటర్న్ తెలిపారు.

ఉగ్రవాదానికి మద్దతిస్తోందన్న కోణంలో చైనాపై వాదించొచ్చని అన్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరించి ప్రపంచానికి ముప్పు తేవడంతోపాటు వైరస్ సమాచారాన్ని దాచిపెట్టినందుకు గాను న్యాయపరంగా చైనాను ప్రశ్నించొచ్చని వివరించారు. కాగా, కొవిడ్‌-19 వెలుగు చూసిన మూడు వారాల్లోనే చర్యలు కనుక తీసుకుని ఉంటే 95 శాతం నియంత్రించే వీలుండేదని ఇంగ్లండ్‌లోని సౌతాంప్టన్ యూనివర్సిటీ తెలిపింది.

  • Loading...

More Telugu News