KCR: ఈ నెల 31 వరకు తెలంగాణలో లాక్ డౌన్: సీఎం కేసీఆర్ ప్రకటన

Telangana CM KCR announces Lock Down in state
  • ఎవరిళ్లలో వారుండాలని స్పష్టీకరణ
  • జనతా కర్ఫ్యూ స్ఫూర్తిని ఈ నెలాఖరు వరకు ప్రదర్శించాలన్న సీఎం కేసీఆర్
  • పేదలకు బియ్యం అందజేస్తామని వెల్లడి
కరోనా విజృంభణ హెచ్చుతున్న నేపథ్యంలో తెలంగాణలో లాక్ డౌన్ ప్రకటించారు. ఈ సాయంత్రం మీడియా సమావేశం ఏర్పాటు చేసిన సీఎం కేసీఆర్ మార్చి 31 వరకు రాష్ట్రంలో లాక్ డౌన్ విధిస్తున్నట్టు వెల్లడించారు. ఎవరింటికి వారు పరిమితం కావాలని, ఇవాళ జనతా కర్ఫ్యూ సందర్భంగా ప్రదర్శించిన స్ఫూర్తిని ఈ నెలాఖరు వరకు కనబర్చాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఎక్కడా ఐదుగురికి మించి గుమికూడవద్దని స్పష్టం చేశారు. ఈ నిబంధన కఠినంగా అమలు చేస్తామని చెప్పారు. అత్యావసర వస్తువుల కోసం కుటుంబానికి ఒక్కరిని మాత్రమే బయటికి అనుమతిస్తారని వెల్లడించారు. ఎవరో చెప్పారన్నట్టుగా కాకుండా మనల్ని మనం కాపాడుకోవాలన్న వివేకంతో వ్యవహరించాలని హితవు పలికారు.

రెక్కాడితే డొక్కాడని పేదల కోసం కొన్నిరోజులకు సరిపడా నిత్యావసరాలు అందిస్తామని చెప్పారు. 87.59 లక్షల మంది తెల్లరేషన్ కార్డు దారులకు మనిషికి 12 కిలోల బియ్యం చొప్పున అందిస్తామని చెప్పారు. పప్పు, ఉప్పు, చింతపండు తదితరాల కోసం ఒక్కో తెల్లకార్డుదారుడికి రూ.1500 నగదు కూడా అందిస్తామని తెలిపారు.
KCR
Telangana
Lock Down
Corona Virus
Janata Curfew

More Telugu News