Corona Virus: ఇటలీలో ఆగని కరోనా మరణ మృదంగం.. 5,500కు పెరిగిన మృతుల సంఖ్య

Corona death toll rises to 13 thousand all over globe
  • ఇటలీలో ఆదివారం ఒక్క రోజే 651 మంది మృతి
  • ప్రపంచవ్యాప్తంగా 13 వేలు దాటిన మరణాలు
  • ఆ 15 లక్షల మందిని మూడు నెలలు బయటకు రావొద్దన్న బ్రిటన్
దేశాలు లాక్‌డౌన్ అవుతున్నా, ప్రభుత్వాలు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నా కరోనా కల్లోలం మాత్రం ఆగడం లేదు. ఈ మహమ్మారి బారినపడి ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య ప్రపంచవ్యాప్తంగా 13 వేలకు చేరింది. బాధితుల సంఖ్య మూడు లక్షలపైనే. ఇటలీలో ఆదివారం ఒక్క రోజే 651 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఆ దేశంలో మొత్తం మరణాల సంఖ్య 5,500కు పెరిగింది.

ఫ్రాన్స్‌లో 562 మంది మరణించగా, పారిస్ ఆసుపత్రిలో ఎమర్జెన్సీ విభాగం వైద్యుడు (67) ఒకరు కరోనా బారినపడి ప్రాణాలు విడిచారు. బ్రిటన్‌లో కరోనా ముప్పు ఉందని భావిస్తున్న 15 లక్షల మందిని మూడు నెలలపాటు బయటకు రావొద్దని అక్కడి ప్రభుత్వం సూచించింది. స్పెయిన్‌లో తాజాగా మరణించిన 394 మందితో కలుపుకుని ఆ దేశంలో మరణించిన వారి సంఖ్య 1720కి చేరింది.

అమెరికాలో లక్షలాదిమంది ఇళ్లకే పరిమితం అవుతున్నారు. న్యూయార్క్ సిటీ జైళ్లలో 38 మందికి కరోనా వైరస్ సోకింది. అమెరికాలో ఒక్క రోజులోనే కొత్తగా ఏడువేల కేసులు నమోదు కావడంతో ఆ దేశంలో మొత్తం నిర్ధారిత కేసుల సంఖ్య 26,574కు చేరింది. మరోవైపు, గత కొన్ని రోజులుగా కొత్త కేసులు నమోదు కాని చైనాలో ఆదివారం తొలి కేసు నమోదైంది. కొత్తగా మరో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. దీంతో చైనాలో మృతుల సంఖ్య 3261కి చేరుకుంది. శ్రీలంకలో కర్ఫ్యూను ఉల్లంఘించిన 340 మందిని అరెస్ట్ చేశారు.
Corona Virus
Italy
Britain
corona victims
lock down

More Telugu News