sukma encounter: దేశాన్ని లోపలి నుంచి నాశనం చేసే వైరస్‌లెన్నో: గంభీర్​

There are many viruses destroying our country from within says gambhir
  • సుక్మా ఎన్‌కౌంటర్ పై స్పందించిన బీజేపీ ఎంపీ
  • 17 మంది ధైర్యవంతులు చనిపోయారని వ్యాఖ్య
  • వారి త్యాగాన్ని మరువలేమన్న మాజీ క్రికెటర్
ఒక్క కరోనానే కాదని దేశంలో మరెన్నో వైరస్‌లు ఉన్నాయని మాజీ క్రికెటర్, బీజేపీ ఎంపీ గౌతమ్‌ గంభీర్ అన్నారు. ఛత్తీస్‌గఢ్‌ లో  17 మంది పోలీసులను నక్సల్స్‌ కాల్చి చంపిన ఘటనపై గంభీర్ పైవిధంగా స్పందించారు. సుక్మా జిల్లాలో శనివారం జరిగిన ఈ ఎదురుకాల్పుల్లో పెద్ద సంఖ్యలో భద్రతా సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. దీనిపై గంభీర్ విచారం వ్యక్తం చేశారు.

దేశాన్ని లోపలి నుంచి నాశనం చేసే ఎన్నో వైరస్‌లు ఉన్నాయని ఈ దాడి నిరూపించిందన్నారు. 17 మంది ధైర్యవంతుల మృతదేహాలు లభ్యమయ్యాయని, వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నా అని తెలిపారు. వారి త్యాగాన్నిఎన్నటికీ మరవలేమని ట్వీట్‌ చేశారు.
sukma encounter
Gautam Gambhir
many viruses
destroying our country

More Telugu News