Rupee: ఆల్ టైమ్ రికార్డు కనిష్ఠానికి రూపాయి విలువ!

Rupee All time low

  • రూపాయి మారకంపై మార్కెట్ పతనం ప్రభావం
  • 95 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్
  • రూ. 76.15కు మారకపు విలువ

స్టాక్ మార్కెట్ పతనం ప్రభావం డాలర్ తో రూపాయి మారకపు విలువపైనా పడింది. ఇప్పటికే అంతంతమాత్రంగా ఉన్న రూపాయి విలువ నేడు పాతాళానికి జారింది. ఫారెక్స్ సెషన్ లో చారిత్రక కనిష్ఠాన్ని నమోదు చేస్తూ, క్రితం ముగింపుతో పోలిస్తే 95 పాయింట్లు పడిపోయి రూ. 76.15కు చేరింది.

కరోనా భయాలు పెరిగిన నేపథ్యంలో, స్టాక్ మార్కెట్ తో పాటు బులియన్ మార్కెట్ సైతం కుదేలైంది. నేటి సెషన్ ప్రారంభంలోనే డాలర్ విలువతో పోలిస్తే 75 పైసలు నష్టపోయిన రూపాయి, ఆపై మరింతగా పతనమైంది. క్రూడాయిల్ విషయానికి వస్తే, బ్యారెల్ ధర 26.24 డాలర్లకు పడిపోయింది. ఇది శుక్రవారం నాటి ముగింపుతో పోలిస్తే 2.74 శాతం తక్కువ.

  • Loading...

More Telugu News