Shivraj Singh Chauhan: మరి కాసేపట్లో ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్న శివరాజ్ సింగ్ చౌహాన్

Shivraj Singh Chauhan to take oath as CM

  • సాయంత్రం 7 గంటలకు చౌహాన్ ప్రమాణస్వీకారం
  • నాలుగోసారి సీఎంగా బాధ్యతలను స్వీకరించనున్న చౌహాన్
  • సింధియా వర్గం రాజీనామా చేయడంతో మైనార్టీలో పడిన కమల్ నాథ్ ప్రభుత్వం

మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా శివరాజ్ సింగ్ చౌహాన్ ఈ సాయంత్రం 7 గంటలకు ప్రమాణస్వీకారం చేయనున్నారు. నాలుగోసారి సీఎంగా బాధ్యతలను స్వీకరించనున్నారు. జ్యోతిరాదిత్య సింధియా కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పిన తర్వాత ఆయనతో పాటు ఆయన వర్గానికి చెందిన 22 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు. దీంతో, కమల్ నాథ్ ప్రభుత్వం మైనార్టీలో పడిపోయింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు గత గురువారం విశ్వాస పరీక్షను ఎదుర్కోకుండానే... ముఖ్యమంత్రి పదవికి కమల్ నాథ్ రాజీనామా చేశారు. దీంతో, మధ్యప్రదేశ్ లో బీజేపీ మరోసారి అధికార పీఠాన్ని అధిష్ఠించబోతోంది.

  • Loading...

More Telugu News