KTR: ఈ వైరస్ అంతమయ్యే వరకు స్వీయ క్రమశిక్షణ పాటించాల్సిందే: మంత్రి కేటీఆర్
- ‘LOCK OUT’ అనేది చాలా అరుదుగా తీసుకునే చర్య
- పరిస్థితి తీవ్రత అర్థం చేసుకోవాలి
- నువ్వు బతకాలి, తోటివారికి బతికే అవకాశమివ్వాలి
తెలంగాణలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో ఈ నెలాఖరు వరకు రాష్ట్రంలో లాక్ డౌన్ విధిస్తున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ స్పందించారు. ‘LOCK OUT’ అనేది చాలా అరుదుగా తీసుకునే చర్య అని, ప్రభుత్వం ఇంత తీవ్రమైన నిర్ణయం తీసుకుంది అంటే పరిస్థితి తీవ్రత అర్థం చేసుకోవాలని ప్రజలకు సూచించారు.
‘నువ్వు బ్రతకడానికి, తోటివారికి బ్రతికే అవకాశం ఇవ్వడానికి ఈ వైరస్ అంతమయ్యే వరకు స్వీయ క్రమశిక్షణ పాటించాల్సిందే’ అంటూ ట్వీట్ చేసిన కేటీఆర్, ‘కరోనా’ వ్యాప్తి నిరోధానికి పాటించాల్సిన జాగ్రత్తలను సూచిస్తూ ఓ వీడియోను పోస్ట్ చేశారు.