Andhra Pradesh: ఏపీలో లాక్ డౌన్ నిబంధనలు మరింత కఠినతరం
- ఉదయం 6 నుంచి 9 గంటల వరకే నిత్యావసరాల కొనుగోలు
- కుటుంబం నుంచి ఒకరు మాత్రమే బయటికి రావాలని స్పష్టీకరణ
- రాత్రి 7 నుంచి ఉదయం 6 గంటల వరకు పూర్తిగా షట్ డౌన్
కరోనా నివారణ కోసం లాక్ డౌన్ విధించినా ప్రజలు తమ సూచనల మేర నడుచుకోవడంలేదని ఏపీ ప్రభుత్వం అసంతృప్తికి లోనైనట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో రాష్ట్రంలో లాక్ డౌన్ నిబంధనలు మరింత కఠినతరం చేశారు. ఉదయం 6 గంటల నుంచి 9 గంటల వరకు మాత్రమే నిత్యావసరాలు కొనుక్కునేందుకు అనుమతి ఉంటుందని ప్రభుత్వం స్పష్టం చేసింది.
కుటుంబం నుంచి ఒకరు మాత్రమే వచ్చి కొనుగోలు చేయాలని స్పష్టం చేసింది. సాయంత్రం 7 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు పూర్తిగా షట్ డౌన్ విధిస్తున్నట్టు తెలిపింది. ఆ సమయంలో ఒక్కరు కూడా ఇళ్ల నుంచి బయటికి రాకూడదని ఆదేశించింది. హోటళ్లలో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకే పార్శిళ్లు తీసుకువెళ్లాలని స్పష్టం చేసింది.