Corona Virus: ప్రాణం కంటే మించింది ఏదీ లేదంటూ ఓ వైద్యుడి ఆసక్తికర వీడియో పోస్ట్
- ‘లాక్ డౌన్’ ను పాటించకుండా విచ్చలవిడిగా తిరగొద్దు
- బయటకు రాకుండా వుండడం వల్ల నష్టమేమీ లేదు
- బయట పెత్తనాలు చేయకండి
కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య క్రమక్రమంగా పెరుగుతుండటంతో అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు అప్రమత్తంగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే 19 రాష్ట్రాలు లాక్ డౌన్ కూడా అమలు చేస్తున్నాయి. ‘కరోనా’ కట్టడికి వైద్యులు, వైద్య సిబ్బంది అహర్నిశలు శ్రమిస్తున్నారు. ఒకరకంగా చెప్పాలంటే, వారి ప్రాణాలను పణంగా పెట్టి పాజిటివ్ బాధితులకు వైద్య సేవలందిస్తున్నారు.
అయితే, కరోనా వైరస్ వ్యాప్తి నివారణకు ప్రభుత్వం, వైద్యులు చెప్పిన సూచనలను పెడచెవిన పెట్టొద్దని, ప్రాణాలకు ముప్పు కొనితెచ్చుకోవద్దంటూ ఓ యువ వైద్యుడు పోస్ట్ చేసిన వీడియో ఆసక్తికరంగా ఉంది. ‘లాక్ డౌన్’ను పాటించకుండా విచ్చలవిడిగా తిరగొద్దని, కొన్ని రోజుల పాటు బయటకు రాకుండా ఇళ్లల్లోనే ఉండటం వల్ల దేశానికి జరిగే నష్టమేమీ లేదని అన్నారు.
ఈ వైరస్ కు ట్రీట్ మెంట్ కూడా లేదని, అలాంటప్పుడు ప్రభుత్వం చెప్పినట్టు ఇళ్లల్లో వుండకుండా, బయట పెత్తనాలు చేస్తారా? అంటూ ఎవరైతే బయటతిరుగుతున్నారో వారికి సుతిమెత్తగా చివాట్లు పెట్టారు. ప్రాణం కంటే మించింది ఏదీ లేదని, ఆ ప్రాణాన్ని కాపాడుకోవడానికి ప్రతి ఒక్కరూ ముందు జాగ్రత్త చర్యలు పాటించాలని కోరారు.