Vijayashanti: ఇటలీ, అమెరికా కన్నా గొప్పోళ్లం కాదు... అదుపుతప్పితే ఏమీ చేయలేము: విజయశాంతి

Vijayashanti Says We are not greater than USA Italy in Medical
  • వైద్య పరంగా మనం మెరుగ్గా లేము
  • ఆ దేశాలే అల్లాడిపోతున్నాయి
  • ప్రజలు వివేకంతో వ్యవహరించాలన్న విజయశాంతి
ఇండియా వైద్య పరంగా ఇటలీ, అమెరికా, స్పెయిన్ దేశాలకన్నా గొప్పదేమీ కాదని, ఆ దేశాలే అల్లాడిపోతున్న వేళ, ఇండియాలో పరిస్థితి అదుపు తప్పితే, ఆపే పరిస్థితి ఉండబోదని కాంగ్రెస్ పార్టీ మహిళా నేత, సినీ నటి విజయశాంతి హెచ్చరించారు. ఈ మేరకు తన ఫేస్ బుక్ ఖాతాలో ఓ ట్వీట్ పెట్టిన ఆమె, ప్రజలు ఆలోచించాలని, వివేకంతో వ్యవహరించాలని సలహా ఇచ్చారు.

"మనం ఇటలీ, అమెరికా, స్పెయిన్ లాంటి చాలా దేశాలకన్నా వైద్యపరంగా గొప్పోళ్లం ఏమీ కాదు. అజాగ్రత్తతో వచ్చిన పరిణామాల వల్ల తక్కువ జనాభా ఉన్న ఆ దేశాలు కూడా అల్లాడిపోతున్నాయి. మన దేశంలో అదుపు తప్పితే, ఆపగలిగే పరిస్థితులు లేవు. పంజాబ్ ఎందుకు కర్ఫ్యూ విధించిందో ఆలోచించాలి. మన రాష్ట్రాలలో కూడా అంతకన్నా తీవ్ర పరిస్థితులు ఏర్పడుతున్నాయి. తెలంగాణలో ఇప్పటికే కరోనా బాధితుల సంఖ్య 33 దాటింది. వైరస్ వ్యాప్తి ప్రారంభం కావడం ప్రస్తుత పరిస్థితిని ఎంతో ఆందోళనకరంగా మార్చింది. ప్రజలారా ఆలోచన చెయ్యండి. వివేకంతో వ్యవహరించండి..
మీ విజయశాంతి" అంటూ ఫేస్ బుక్ లో పేర్కొన్నారు. 
Vijayashanti
Facebook
Corona Virus
India
Italy
USA

More Telugu News