China: హిందూ మహాసముద్రంలో అండర్ వాటర్ డ్రోన్లను మోహరిస్తున్న చైనా... భారత్ అలర్ట్!
- డజను అండర్ వాటర్ డ్రోన్లను మోహరింపజేస్తున్న చైనా
- వాణిజ్య, మిలిటరీ కార్యకలాపాల కోసం వినియోగించుకునే అవకాశం
- గతంలో చైనా నౌకను హెచ్చరించిన ఇండియన్ నేవీ
హిందూ మహాసముద్రంలో ఒక డజను అండర్ వాటర్ డ్రోన్లను మోహరింపజేసేందుకు చైనా సిద్ధమవుతుండటంతో... భారత్ అప్రమత్తమయింది. హైడ్రోగ్రాఫిక్ సర్వే, ఓషియానిక్ రీసర్చ్ లో భాగంగా వీటిని చైనా ఉపయోగించనుంది. అయితే, డీప్ సీ మైనింగ్ తో పాటు ఇతర వాణిజ్య సంబంధ కార్యకాపాల కోసమే చైనా ఈ చర్యలు చేపట్టబోతోందని భారత్ భావిస్తోంది. సబ్ మెరైన్ ఆపరేషన్లకు కూడా వీటిని చైనా ఉపయోగించుకోవచ్చని అంచనా వేస్తోంది.
ఇటీవలి కాలంలో చైనాకు చెందిన నౌక భారత జలాల్లోకి ప్రవేశించడంతో ఇండియన్ నేవీ దాన్ని హెచ్చరించింది. దీంతో, ఆ నౌక వెనక్కి వెళ్లిపోయింది. అప్పటి నుంచి మళ్లీ భారత జలాల్లోకి ప్రవేశించలేదు. మిలిటరీ కార్యక్రమాల కోసమే ఆ నౌక మన జలాల్లోకి ప్రవేశించి ఉండవచ్చని నేవీ అధికారులు అనుమానిస్తున్నారు.