Andhra Pradesh: ఆంధప్రదేశ్‌లో పదో తరగతి పరీక్షలు వాయిదా
- ప్రకటించిన విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్
- 31వ తేదీన మొదలవ్వాల్సిన పరీక్షలు
- కరోనా వ్యాప్తి నేపథ్యంలో ప్రభుత్వం కీలక నిర్ణయం
ఆంధప్రదేశ్‌లో పదో తరగతి పరీక్షలు వాయిదా వేశారు. ఈ నెల 31వ తేదీ నుంచి పరీక్షలు జరగాల్సి ఉంది. అయితే, కరోనా వ్యాప్తి నేపథ్యంలో పరీక్షలను ఇప్పుడు నిర్వహించకపోవడమే మంచిదని ప్రభుత్వం నిర్ణయించింది. పరీక్షలను రెండు వారాలపాటు వాయిదా వేయనున్నట్టు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ ప్రకటించారు. ఈ నెల 31 తర్వాత పరిస్థితులను సమీక్షించిన తర్వాత కొత్త తేదీలను ప్రకటిస్తామని తెలిపారు.
కరోనా కట్టడిపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఈ రోజు ఉదయం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. అనంతరం పరీక్షలు వాయిదా వేస్తున్నట్టు విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది. కరోనా వ్యాప్తిని అరికట్టే చర్యల్లో భాగంగా ప్రస్తుతం రాష్ట్రంలో లాక్‌డౌన్ ప్రకటించారు. రాష్ట్రంలో ఇప్పటిదాకా ఏడుగురు కరోనా బారిన పడ్డారు.