Telangana: తెలంగాణలో ఇంటింటి సర్వే... కేసీఆర్ సర్కారు కీలక నిర్ణయం!

Home survey in Telangana

  • రోజురోజుకూ పెరుగుతున్న కరోనా భయం
  • 27 వేల మంది ఆశావర్కర్లు, 8 వేల మంది ఏఎంఎన్ఎంల సర్వే
  • జలుబు, దగ్గు, జ్వరంతో బాధపడేవారి వివరాల సేకరణ

దేశవ్యాప్తంగా కరోనా వ్యాధి భయం రోజురోజుకూ పెరుగుతున్న వేళ, ఇప్పటికే పలు నియంత్రణా చర్యలు ప్రకటించిన కేసీఆర్ ప్రభుత్వం మరో కీలక అడుగు వేయనుంది. రాష్ట్రంలోని ప్రజల ఆరోగ్య పరిస్థితిపై నివేదికను తయారు చేయాలని నిర్ణయించింది. ఇందుకోసం మరోమారు ఇంటింటి సర్వేను జరిపించనుంది. వైద్య, ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో 27 వేల మంది ఆశావర్కర్లు, 8 వేల మంది ఏఎంఎలు ఈ సర్వే కోసం పనిచేయనున్నారు.

నేటి నుంచి ఈ సర్వే పనులు ప్రారంభం అవుతాయని, కరోనా వ్యాప్తిని నిరోధించడమే లక్ష్యంగా, ప్రతి ఇంట్లో జలుబు, దగ్గు, జ్వరం తదితరాలతో బాధపడుతున్న వారి వివరాలతో రిపోర్ట్ ను వీరు తయారు చేస్తారని ఆరోగ్య శాఖ ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. బాధితుల వివరాలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తుంటామని తెలిపారు.

కాగా, లాక్ డౌన్ లో భాగంగా గాంధీ, ఫీవర్, కింగ్ కోఠి, చెస్ట్ ఆసుపత్రుల్లో ఓపీ సేవలను, నాన్ ఎమర్జెన్సీ సర్జరీలను నిలిపివేశారు. అత్యవసర కేసులను మాత్రమే అనుమతిస్తున్నారు. ఇప్పటివరకూ తెలంగాణలో 33 పాజిటివ్ కేసులు నమోదుకాగా, వారెవరికీ ప్రాణాపాయం లేదని వైద్య వర్గాలు వెల్లడించాయి.

  • Loading...

More Telugu News