Ravichandran Ashwin: ట్విట్టర్ హ్యాండిల్ పేరును మార్చుకున్న రవిచంద్రన్ అశ్విన్

Ravichandran Ashwin changes his twitter handle name
  • లెట్స్ స్టే ఇండోర్స్ ఇండియా అని  పేరు మార్చుకున్న అశ్విన్
  • రానున్న రెండు వారాలు చాలా ముఖ్యమని వ్యాఖ్య
  • ప్రజలంతా సామాజిక దూరాన్ని పాటించాలి
యావత్ దేశం కరోనా రక్కసిపై పోరాడుతున్న వేళ టీమిండియా స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ కీలక నిర్ణయం తీసకున్నాడు. అందరిలో స్ఫూర్తిని నింపేలా తన ట్విట్టర్ హ్యాండిల్ పేరును మార్చుకున్నాడు. 'లెట్స్ స్టే ఇండోర్స్ ఇండియా' అనే పేరు పెట్టుకున్నాడు.

కరోనా కట్టడి కోసం ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతను నెరవేర్చాలని... బయటకు రాకుండా ఇళ్లలోనే ఉండిపోవాలని సందేశాన్ని ఇచ్చాడు. కరోనా కట్టడికి రానున్న రెండు వారాలు చాలా కీలకమని... ప్రభుత్వ ఆదేశాలను  ప్రతి ఒక్కరూ గౌరవించాలని చెప్పాడు. ప్రధాని మోదీ పిలుపు మేరకు జనతా కర్ఫ్యూ విజయవంతమైందని... ఇదే స్ఫూర్తితో ప్రజలంతా సామాజిక దూరాన్ని పాటించాలని అశ్విన్ కోరాడు.
Ravichandran Ashwin
Twitter Handle
Team India

More Telugu News