Chiranjeevi: సోషల్ మీడియాలోకి ఎంటరవుతున్న చిరంజీవి... ఉగాది రోజున శ్రీకారం
- ఇప్పటివరకు సోషల్ మీడియాలో లేని చిరు
- ఇకపై తన బాణీ బలంగా వినిపించాలని నిర్ణయం
- ఉగాది రోజున సోషల్ మీడియా ఖాతాలు ప్రారంభం
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి తన అభిప్రాయాలను మరింత బలంగా వినిపించడం కోసం సోషల్ మీడియాలోకి అడుగుపెడుతున్నారు. ఇప్పటివరకు ఆయనకు సామాజిక మాధ్యమాల్లో ఖాతాలు లేవు. ఎప్పుడైనా సందేశం ఇవ్వాలంటే వీడియో రూపంలో వెలువరించేవారు. ఇకపై ఆయన ట్విట్టర్, ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్ వంటి ప్రముఖ సోషల్ నెట్వర్కింగ్ సైట్లలో తన అభిప్రాయాలను అభిమానులతో పంచుకోవాలని నిర్ణయించారు. అందుకు ఉగాది రోజున శ్రీకారం చుడుతున్నారు. రేపు ఉగాది పర్వదినం సందర్భంగా అభిమానులతో చిరంజీవి లైవ్ స్ట్రీమింగ్ నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని ఆయన స్వయంగా వెల్లడించారు. తను భావాలను అందరితో పంచుకోవడానికి సోషల్ మీడియాను సరైన వేదికగా భావిస్తున్నానని చిరు చెప్పారు.