Corona Virus: కోల్ కతాలో లాక్ డౌన్ ను ఉల్లంఘించిన 255 మంది అరెస్ట్
- కరోనా నేపథ్యంలో కఠినంగా వ్యవహరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వాలు
- హెచ్చరికలను లెక్క చేయకుండా రోడ్లపైకి వస్తున్న జనం
- అరెస్ట్ చేసి, కేసులు బుక్ చేస్తున్న పశ్చిమబెంగాల్ పోలీసులు
కరోనా విస్తరిస్తున్న నేపథ్యంలో అన్ని రాష్ట్రాలు కఠిన నింబంధనలు అమలు చేస్తున్నాయి. దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు లాక్ డౌన్ విధించాయి. అత్యవసరం ఉంటే తప్ప ఎవరూ బయట తిరగొద్దని హెచ్చరికలు జారీ చేశాయి. అయితే, ఈ హెచ్చరికలను పెడచెవిన పెడూతూ అనేక మంది రోడ్లపైకి వస్తున్నారు. ఇలాంటి వ్యక్తులపై పోలీసులు చర్యలకు ఉపక్రమిస్తున్నారు.
కోల్ కతాలో నిబంధనలను ఉల్లంఘించి రోడ్లపైకి వచ్చిన 255 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఐపీసీ సెక్షన్ 188 ప్రకారం వీరిని అదుపులోకి తీసుకుని కేసులను నమోదు చేశారు. పశ్చిమబెంగాల్ లో ఇప్పటి వరకు 7 కరోనా కేసులు నమోదయ్యాయి. ఒక మరణం సంభవించింది. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్ర ప్రభుత్వం కఠిన ఆంక్షలను అమలుచేస్తోంది.