Chiranjeevi: ఇన్ స్టాగ్రామ్ లో ఒక్క పోస్టుతో చిరంజీవి ప్రభంజనం

Chiranjeevi enters into Instagram as followers rushed
  • చిరంజీవి కొణిదెల పేరుతో ఇన్ స్టా అకౌంట్ ప్రారంభం
  • వేల లైకులు సొంతం చేసుకున్న చిరు ప్రొఫైల్ పిక్
  • 2.62 లక్షల మంది ఫాలోవర్లను సంపాదించుకున్న చిరు
మెగాస్టార్ చిరంజీవి రేపు ఉగాది నుంచి సోషల్ మీడియాలో క్రియాశీలకంగా వ్యవహరించాలని నిర్ణయించుకున్నారు. ఇప్పటికే ఆయన ఇన్ స్టాగ్రామ్ లో ఖాతా తెరిచారు. ఇన్ స్టాగ్రామ్ లో కేవలం తన ప్రొఫైల్ పిక్ ను మాత్రమే పోస్టు చేసిన చిరు ఏకంగా ప్రభంజనం సృష్టించారు. ఆ ఒక్క పోస్టు వేల లైకులు పొందగా, చిరు 2.62 లక్షల మంది ఫాలోవర్లను పొందారు. 'చిరంజీవి కొణిదెల' అనే పేరుతో చిరు ఇన్ స్టా అకౌంట్ ప్రారంభించగా, అప్పుడే వెరిఫికేషన్ మార్క్ కూడా లభించడం విశేషం. బుధవారం ఉగాది సందర్భంగా చిరంజీవి తన అభిమానుల కోసం సోషల్ మీడియా లైవ్ లోకి రానున్నారు.
Chiranjeevi
Social Media
Instagram
Followers
Tollywood

More Telugu News