Nagababu: సోషల్ మీడియాలోకి అన్నయ్య చిరంజీవికి హృదయపూర్వకంగా స్వాగతం: నాగబాబు

Nagababu welcomes his brother chiranjeevi into social media
  • సోషల్ మీడియాలోకి చిరంజీవి రానుండటంపై నాగబాబు స్పందన
  • నాకు చాలా సంతోషంగా ఉంది
  • చిరంజీవి మాట్లాడుతున్న ఓ వీడియోను పోస్ట్ చేసిన నాగబాబు
రేపటి నుంచి సోషల్ మీడియా లోకి వస్తున్నట్లు ప్రముఖ నటుడు చిరంజీవి ప్రకటించిన విషయం తెలిసిందే. దీనిపై చిరంజీవి సోదరుడు, నటుడు నాగబాబు స్పందించారు. సోషల్ మీడియాలోకి వస్తున్నట్టు అన్నయ్య ప్రకటించడం తనకు చాలా సంతోషంగా ఉందని అన్నారు. సామాజిక మాధ్యమాలను వేదికగా చేసుకోనున్న ఆయన, ప్రజలపై కచ్చితంగా పాజిటివ్ ప్రభావం చూపనున్నారని అన్నారు. సోషల్ మీడియాలోకి తన అన్నయ్యను హృదయపూర్వకంగా స్వాగతిస్తున్నానంటూ ఓ ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడిన వీడియోను నాగబాబు జతపరిచారు.
 

Nagababu
Chiranjeevi
Tollywood
Social Media

More Telugu News