India: ఐఓసీ నిర్ణయం మా అథ్లెట్లకు ఉపశమనం కలిగిస్తుంది: భారత్

India responds on IOC decision of Tokyo Olympics postponement

  • టోక్యో ఒలింపిక్స్ ను వాయిదా వేసిన ఐఓసీ
  • ఐఓసీ నిర్ణయాన్ని స్వాగతించిన భారత ఒలింపిక్ సంఘం
  • ఐఓసీ తమను కూడా సంప్రదించిందని వెల్లడి

టోక్యో ఒలింపిక్స్ కూడా కరోనా ఖాతాలోకి చేరిపోయింది. జపాన్ గడ్డపై జూలై చివరి వారం నుంచి జరగాల్సిన ఒలింపిక్ క్రీడలు వచ్చే ఏడాదికి వాయిదాపడ్డాయి. ఈ మేరకు అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) ప్రకటించింది. ఐఓసీ నిర్ణయాన్ని భారత్ స్వాగతించింది.

ఒలింపిక్స్ వాయిదా వేసేముందు ఐఓసీ తమను కూడా సంప్రదించిందని భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) సెక్రటరీ జనరల్ రాజీవ్ మెహతా వెల్లడించారు. అన్ని సభ్యదేశాల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాత ఒలింపిక్స్ వాయిదా వేశారని, ఐఓసీ తీసుకున్న నిర్ణయం భారత అథ్లెట్లకు కచ్చితంగా ఉపశమనం కలిగిస్తుందని, వారిపై ఒత్తిడిని తొలగిస్తుందని అన్నారు. లాక్ డౌన్ ముగిసిన తర్వాత ఐఓసీ క్రీడాకారులు, క్రీడాసంఘాలు, స్పాన్సర్లతో చర్చించి తదుపరి నిర్ణయం తీసుకుంటుందని రాజీవ్ మెహతా వెల్లడించారు.

  • Loading...

More Telugu News