Mosquito: దోమకాటుతో కరోనా వైరస్ వస్తుందా?.. స్పష్టతనిచ్చిన కేంద్రం
- దోమకాటు ద్వారా వైరస్ వ్యాపించదు
- వెల్లుల్లి తినడం వల్ల వైరస్ను అడ్డుకోలేం
- మరోమారు స్పష్టం చేసిన కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ
కరోనా వైరస్ వ్యాప్తిపై జరుగుతున్న ఊహాగానాలకు ఇప్పటికే తెరదించిన కేంద్రం తాజాగా మరోమారు స్పష్టత నిచ్చింది. చికెన్ తినడం వల్ల వైరస్ వస్తుందన్న ప్రచారం ఇప్పటి వరకు విపరీతంగా జరిగింది. దీనిని ఖండించిన ప్రభుత్వం ఈ వార్తల్లో నిజం లేదని స్పష్టం చేసింది. అలాగే, గాలి ద్వారా, పేపర్ల ద్వారా ఈ వైరస్ ఒకరి నుంచి మరొకరికి సోకదని వివరణ ఇచ్చింది.
తాజాగా, దోమకాటు ద్వారా వైరస్ వ్యాపిస్తుందన్న ప్రచారం జోరుగా సాగుతోంది. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ఈ వార్తలను కూడా తోసిపుచ్చింది. దోమకాటు ద్వారా వైరస్ వ్యాపించదని స్పష్టం చేసింది. ఈ విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పింది. అలాగే, వెల్లుల్లి తినడం వల్ల, ఆల్కహల్ తీసుకోవడం ద్వారా కరోనా వైరస్ను అడ్డుకోవచ్చన్న విషయంలో శాస్త్రీయత లేదని స్పష్టం చేసింది.