CBFC: దేశంలోని అన్ని సీబీఎఫ్సీ కార్యాలయాల నిరవధిక మూత!

CBFC Offices Shut down over Corona
  • దేశంలోని 9 కేంద్రాల మూసివేత
  • సినిమాల స్క్రీనింగ్ ఉండబోదు
  • వైరస్ వ్యాప్తి తగ్గిన తరువాత తిరిగి తెరుస్తామన్న ప్రసూన్ జోషి
ఇండియాలో ఉన్న 9 సీబీఎఫ్సీ (సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఫిల్మ్‌ సర్టిఫికేషన్) కేంద్రాలను తాత్కాలికంగా మూసివేస్తున్నట్టు సంస్థ చైర్మన్ ప్రసూన్  జోషి వెల్లడించారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. సీబీఎఫ్సీకి సంబంధించిన క్లయింట్స్, ప్యానెల్‌ సభ్యులు, అధికారులు, ఉద్యోగుల ఆరోగ్యాలను దృష్టిలో ఉంచుకుని దేశంలోని సీబీఎఫ్సీ కార్యాలయాలను మూసివేస్తున్నట్టు ఆయన తెలిపారు.

 ఇకపై ఈ కేంద్రాల్లో సినిమాల స్క్రీనింగ్‌, సర్టిఫికేషన్ ఉండబోవని, కరోనా ప్రభావం తగ్గిన తరువాత ఈ కేంద్రాలు తిరిగి ప్రారంభమవుతాయని తెలిపారు. నిర్మాతల సందేహాలను తీర్చేందుకు హెల్ప్‌లైన్ నెంబర్లను ఇప్పటికే అందుబాటులోకి తెచ్చామని, సంస్థలోని కొందరు ఉద్యోగులు ఇంటి నుంచి పని చేస్తున్నారని ప్రసూన్ జోషి వివరించారు. ఆన్ లైన్ అప్లికేషన్స్‌, ఫిల్మ్‌ అప్లికేషన్స్‌ వంటి సేవలు అందుతాయని తెలిపారు. కాగా, కరోనా వైరస్ వ్యాప్తి ప్రభావంతో ఇప్పటికే సినిమా షూటింగులన్నీ నిలిచిపోయిన సంగతి తెలిసిందే.
CBFC
Office
Closure
Prasoon Joshi

More Telugu News