Vijayawada: అన్నార్తులకు విజయవాడ పోలీసుల ఆసరా... ఆహారం ప్యాకెట్ల పంపిణీ

police supply food packets for travelers and road siders

  • విజయవాడ బెంజ్‌ సర్కిల్‌ ప్రాంతాల్లో వారికి అందజేత
  • కూడలిలో భారీగా మోహరించిన పోలీసులు
  • అత్యవసర పనులున్న వారికే అనుమతి

లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఓవైపు కఠినంగా వ్యవహరిస్తునే, మరోవైపు పోలీసులు మానవతా దృక్పథంతో కూడా వ్యవహరిస్తున్నారు. విజయవాడ బెంజ్‌ సర్కిల్‌లో భారీగా మోహరించిన పోలీసులు అత్యవసర పనిపై వెళ్తున్నట్లు తగిన ఆధారాలున్న వారిని తప్ప మిగిలిన వారిని రోడ్లపైకి అనుమతించడం లేదు. దుకాణాలు, అన్నిరకాల వ్యాపారాలు మూతపడ్డాయి. దీంతో సర్కిల్‌ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఫుట్‌పాత్‌పైనే, బస్టాప్‌ల్లో పడివున్న నిరాశ్రయులు, మానసిక స్థితి సరిగా లేనివారు, యాచకులు ఆహారంలేక అలమటిస్తున్నారు.

సాధారణ రోజుల్లో వీరికి పలువురు దాతలు ఏదో రూపంలో ఆహారం అందించడమో, హోటళ్ల వద్దకు వెళ్లి యాచించి తెచ్చుకుని కడుపు నింపుకోవడమో చేసుకునే వారు. ప్రస్తుతం వీరికి ఆ అవకాశం కూడా లేకపోవడంతో పోలీసులే ఆహార పదార్థాల పొట్లాలను వీరికి అందించి ఆదుకుంటున్నారు. అలాగే వేరే ప్రాంతాల నుంచి వచ్చి రవాణా సదుపాయం లేక నగరంలో చిక్కుకున్న వారికి ఆహారం అందజేస్తున్నారు.

  • Loading...

More Telugu News