Chiranjeevi: ట్విట్టర్ లో చిరంజీవి కవ్వింపు... వెంటనే బదులిచ్చిన మోహన్ బాబు!

Funny verbal war between Chiranjeevi and Mohan Babu
  • ట్విట్టర్ లో అడుగుపెట్టిన చిరంజీవి
  • స్వాగతం పలికిన మోహన్ బాబు
  • "రాలేననుకున్నావా" అంటూ మోహన్ బాబును ఉద్దేశించి చిరు కామెంట్
మెగాస్టార్ చిరంజీవి ఉగాది సందర్భంగా సోషల్ మీడియాలో కాలుమోపిన సంగతి తెలిసిందే. ఆయనకు పెద్ద సంఖ్యలో శుభాకాంక్షలు వస్తున్నాయి. ఆయన మిత్రుడు మోహన్ బాబు కూడా ట్విట్టర్ లో స్వాగతం పలికారు. అందుకు చిరంజీవి స్పందిస్తూ, "థాంక్యూ మిత్రమా... రాననుకున్నావా రాలేననుకున్నావా" అంటూ సినీ ఫక్కీలో వ్యాఖ్యానించారు.

దానికి మోహన్ బాబు వెంటనే బదులిచ్చారు. "ఈసారి హగ్ చేసుకున్నప్పుడు చెబుతాను" అంటూ కొంటెగా స్పందించారు. ఇటీవల ఓ కార్యక్రమంలో మోహన్ బాబును చిరంజీవి ఆప్యాయంగా హత్తుకుని బుగ్గపై ముద్దు పెట్టారు. వారిద్దరి మధ్య స్నేహానికి ఈ సన్నివేశం ఓ నిదర్శనంలా నిలిచింది.
Chiranjeevi
Mohan Babu
Twitter
Social Media

More Telugu News